నవచైతన్య కాంపిటీషన్స్ - గ్రూప్-2 ప్రశ్నాపత్రాల శ్రేణి
మిత్రమా,
గ్రూప్-2 పోటీ పరీక్షకు ఇంటి వద్ద ఉండి సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ ను ప్రారంభిస్తున్నది. సుమారు 100 రోజుల పాటు నిరంతరాయంగా డైలీ టెస్ట్ లతో సిలబస్ ను మొదటి సారి క్షుణ్ణంగా చదివించేందుకు ప్రోత్సహించడంతో పాటు, తరువాత సిలబస్ ను రివిజన్ చేయడానికి తగిన 20 రివిజన్ టెస్ట్లు ఆపై గ్రాండ్ టెస్ట్లతో ఈ శ్రేణి నిర్వహించనున్నాము.
ఈ శ్రేణిలో మీకు లభిస్తాయి . . .
+ 100 డైలీ టెస్ట్లు (ఒక్కొక్కటి 40 ప్రశ్నలతో)
+ 20 సబ్జక్ట్ వైజ్ రివిజన్ టెస్ట్లు (ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో)
+ 5 గ్రాండ్ టెస్ట్లు (ఒక్కొక్కటి 150 ప్రశ్నలతో)
అంటే మొత్తంగా 4000+2000+750 = 6750 బిట్స్ తో కూడిన ఈ ప్రశ్నాపత్రాలను మీరు రూ. 700 చెల్లించి ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు మరియు పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్య విశేషాలు . . .
+ మొత్తంగా లభించేవి 100 డైలీ టెస్ట్లు + 20 సబ్జక్ట్ వైజ్ రివిజన్ టెస్ట్లు + 5 గ్రాండ్ టెస్ట్లు
+ ప్రతి టెస్ట్ ఆన్ లైన్ లో రాయవచ్చు లేదా పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
+ రాసిన అభ్యర్ధుల నుంచి ప్రతి టెస్ట్ కు ర్యాంకింగ్ షీట్ ఇవ్వబడుతుంది.
+ అరిథ్ మెటిక్, రీజనింగ్ విభాగాలకు ఎక్స్ ప్లనేషన్ ఉంటుంది.
+ ప్రతి ప్రశ్నాపత్రానికి కీ వెరిఫికేషన్, ఇతర కమ్యూనికేషన్ అప్ డేట్స్ వాట్సాప్ ద్వారా నిర్వహించబడుతుంది.
గుర్తుంచుకోండి . . .
+ పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలు మాకు అప్ డేట్ కావడానికి, మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్ లేదా? / పేమెంట్ కావడం లేదా?
మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోయినా/కార్డ్ ద్వారా పేమెంట్ కాకపోయినా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా క్రింది QR Code లేదా UPI కోడ్ ద్వారా పేమెంట్ చేసి తరువాత మీ పేమెంట్ ఐడి, మీ పేరు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ చిరునామా, డేటాఫ్ బర్త్, జిల్లా వివరాలను 9640717460 కు వాట్సాప్ ద్వారా పంపండి.
పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .
+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.
ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.




No comments
Post a Comment